Header Ads

Shubhapallaba English Portal
  • Latest Post

    చక్రనయనాల రథచక్రాలు


    ఎప్పుడు దర్శనమిస్తాయో పుష్పముకుట అభూషిత చక్రనయనాలు,
    అత్యంత దివ్యం పూరి శ్రీక్షేత్రంలో శ్రీనాథుని నందిఘోష రథచక్రాలు |౧|

    నీలాచలధామంలో వార్షిక రథ జాతర నిత్య నూతనం పురాతనం,
    భక్తులు కోరుకుంటున్నారు స్వామివారి నవయవ్వన దివ్యదర్శనం |౨|

    రథోత్సవం కొరకు సమలంకృతం అవుతోంది శ్రీమందిరం,
    జగత్ప్రసిధ్ధ త్రి రథాల పరిదర్శనం ఎంతో అమోఘం సుందరం |3|

    జన-సముద్రంలో వస్తారు మన నాథులు,
    కళింగ ఉత్కళవాసుల భక్తికి ప్రతిరూపం మన శ్రీజగన్నాథులు |౪|

    శోభాయమానం అయ్యెను తాళధ్వజం దేవదళనం నందిఘోష రథాలు,
    శ్రీగుండిచా చిన్నమ్మ మందిరం వరకు నిర్దిష్టం నిర్ణీతం అయ్యెను వారి పథములు |౫|

    హేరాపంచమి నాడు స్వామివారి రథచక్రానికి శ్రీమహాలక్ష్మి చేశేను భంగం,
    శ్రీమందిర రత్నసింహాసనంలో ఆసీనులవటానికి అడిగెను శీఘ్ర తిరుగుప్రయాణం|౬|

    ఆషాఢ శుద్ధ దశమి నాడు రథచక్రాలు చేశెను పునః ప్రయాణం,
    ఆనంద లహరి సానంద తాండవం చేశెను అగణిత ఉపాసక గణం |౭|

    ఎంతో సొంతం అనిపించెను పూరి శరధా సైకతం,
    ఆ ప్రాంతంలో నడిచి నడిచి ప్రతి ఒక్కరు అయ్యెను ప్రసన్నచిత్తం |౮|

    నయనమనోహరం హరిశయన ఏకాదశి నాటి ముగ్గురు ఠాకూరుల సురమ్య స్వర్ణవేషం,
    ఆహ్లాదకర సమావేశంలో  శ్రీబలభద్ర శ్రీ సుభద్ర శ్రీ జగన్నాథ భక్తులు పొందెను పరవశం |౯|

    అనుష్ఠించబడెను సువాసిత సుమధుర అధరపానీయం నీతి,
    బహు ప్రాచీనమైనది జనార్దనునికి ఈ రమ్యమైన రీతి |౧౦|

    త్రిమూర్తుల నీలాద్రి బిజె ప్రస్థానంతో అయ్యెను పూరి రథయాత్ర సమాపనం,
    క్షీరమోహనం మిష్టాన్న కానుక ద్వారా శ్రీనాథులు శ్రీదేవి భేటి ఒక సుగమ సమాగమం |౧౧|

    ఎప్పటివరకు ఈ వసుంధరలో ఉండెను నడిచెను జీవన చక్రాలు,
    అప్పటివరకు శంఖక్షేత్రం భవ్యమార్గంలో ఏటేటా తిరిగేను విశ్వవిఖ్యాత చక్రనయనాల రథచక్రాలు |౧౨|

    రచన: శ్రీ రాజశేఖర్ చెముడుపాటి (చీమ)

    1 comment:

    1. A good attempt to describe yearly Ratha Yatra at Puri in modern telugu verse.

      ReplyDelete

    Post Top Ad

    Shubhapallaba free eMagazine and online web Portal

    Post Bottom Ad

    Shubhapallaba Punjabi Portal